Business Ideas Without Investment: సొంతంగా బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే పెట్టుబడి పెద్ద సమస్య కాదు. పెట్టుబడి లేకుండా కూడా ప్రారంభించగలిగే వ్యాపారాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఐడియాలు ఇవి.
![]() |
Business Ideas Without Investment |
1. హోమ్ మేడ్ ఫుడ్స్ - టాలెంట్ ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్: స్వీట్స్, బేకరీ ఐటమ్స్ లేదా పచ్చళ్ళు చేయడంలో నైపుణ్యం ఉంటే ఈ బిజినెస్ మంచి ఆప్షన్. ముందుగా కొన్ని సాంపిల్స్ తయారు చేసి ఫొటోలు లేదా రీల్స్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయండి. సోషల్ మీడియాలో క్రియేటివ్‌గా పోస్టులు పెడితే ఆర్డర్స్ వస్తాయి. డెలివరీ కోసం కొరియర్ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు.
2. ఆన్‌లైన్ కోర్స్ - స్కిల్‌ను డిజిటల్‌గా మార్చండి: ఇంగ్లిష్, హిందీ వంటి లాంగ్వేజెస్, కేక్స్ తయారీ, మ్యూజిక్, డ్యాన్స్, మెహందీ, ఎంబ్రాయిడరీ… ఇలా మీకు తెలిసిన ఏదైనా స్కిల్‌ను వీడియోల రూపంలో రికార్డు చేసి ఉడెమీ వంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో కోర్సుగా అప్‌లోడ్ చేయండి. నేర్చుకోవాలనుకునే వారు దాన్ని కొనుగోలు చేస్తారు.
3. అఫిలియేట్ మార్కెటింగ్ - సింపుల్‌గా ఇన్‌కమ్ వచ్చే మార్గం: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని, ఆఫర్స్ ఉన్న ప్రొడక్ట్స్ లింక్స్‌ను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీ సర్కిల్‌లో ఉన్న వారు ఆ లింక్ ద్వారా కొనుగోలు చేస్తే కమీషన్ వస్తుంది. నెలకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
4. పెట్ కేర్ సర్వీసెస్ - మెట్రోల్లో డిమాండ్ ఎక్కువే: హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో పెట్స్‌ను చూసుకోవడం చాలా మందికి సమస్యగా ఉంటుంది. ఈ అవకాశం మీరు బిజినెస్‌గా మార్చుకోవచ్చు. మీ దగ్గర ఖాళీ ప్రదేశం ఉంటే పెట్ కేర్ సెంటర్ ప్రారంభించి నెలవారీ ఛార్జ్ వసూలు చేయవచ్చు.
5. ఆన్‌లైన్ కంటెంట్ - సోషల్ మీడియా ద్వారా ఆదాయం: ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో కంటెంట్ క్రియేట్ చేసి ఆదాయం సంపాదించవచ్చు. డ్యాన్స్, సింగింగ్, కామెడీ వీడియోలు, ట్రావెల్ వ్లాగ్స్ లేదా చిన్న పిల్లల ఆటలు, మాటలు కూడా షేర్ చేయవచ్చు. ఫాలోవర్స్ పెరిగితే బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా మంచి ఆదాయం వస్తుంది.
తక్కువ పెట్టుబడితో కూడా వ్యాపారం ప్రారంభించవచ్చు. మీరు ఆసక్తి, సృజనాత్మకత చూపిస్తే చిన్నగా మొదలుపెట్టి పెద్దగా ఎదగడం ఖాయం.